రవి వారం రాగ కణిక
తేది :04-012-2022
పదములు :
పిలక
అలక
చిలక
నీ తలకాయ
ఆవకాయ
భరతమాత బిడ్డవయ్యి
భక్తేందుకు లేదురా....
ఆచారం అంటేనే
అంటిముట్టనంటావు
సంస్కృతి మాటెత్తితే
అలసత్వం చూపిస్తవు
పాశ్చాత్యం మోజులో
ఆలస్యంగా మేల్కొని
పాచిపండ్ల తేనీరుతో
పనులు మెదలెడ్తావు….
భరతమాత బిడ్డవయ్యి
భక్తేందుకు లేదురా....
నుదుటన సింధూరము
న్యూనతగా భావిస్తావు
పిలకలన్నీ నామోషాయె
కాదంటిక అలకలాయె ...
పెరిగిన గడ్డాలు క్రాపులతో
తరిగిన శుచి శుభ్రతలతో…
చిరిగిన జీన్లను వేసుకుని
అధునాతనమని మురుస్తున్నవు
భరతమాత బిడ్డవయ్యి
భక్తేందుకు లేదురా....
కలుషితాలు మూటగట్టి
కాలుష్యం చేస్తున్నవు ...
పక్షులు చిలకలన్నియు
మాయమయ్యే మంత్రమేస్తున్నవు…
స్వచ్ఛ నీరు జాడలేక
తలకాయ పట్టుకుంటే
తగుదునమ్మ నేనంటూ
ప్రాణవాయువు పగబట్టే ....
భరతమాత బిడ్డవయ్యి
భక్తేందుకు లేదురా....
మంచి ఎప్పుడైనా
మంచే కదా సోదరా …
పాశ్చాత్యం సరే సరి
సంప్రదాయం బరాబరి…
చెట్టుమీది కాయతో
సముద్రంలో ఉప్పు కలిపి
పెరుగన్నానికి తోడుగా
ఆవకాయ తినిచూడు ....
భరతమాత బిడ్డవయ్యి
భక్తేందుకు లేదురా....
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment