చిత్ర కవిత 2
తేదీ : 24-12-2022
శీర్షిక : తల్లి ప్రేమ
కవిత సంఖ్య : 201
విధి రాతలు ఎంత బలీయమో...
వింత గొలుపగ రూఢియయ్యే ...
చిత్రకారుడు విచిత్రముగా
బంధించిన చిత్రము కారుణ్యమై ....
కసాయి పులి నోట తల్లిని కరుచుకున్నా...
కనిపెట్టలేని మర్కటపు కూన కరుచుకున్న తీరు
కంట నీరు పెట్టిస్తుంటే... హృదయవిదారకమే ...
కాని కాలమనుకోవాలా? కలికాలమనుకోవాలా ?
తనువు విడిచేంత తండ్లాటలలో కూడా
చితిమంటలనెక్కే చివరి క్షణం దాకా
మర్కటం కురిపించే మమతల నీడ
గుండెకు హత్తుకున్న కూనను చూసిన....
తల్లి ప్రేమల తపనలు ఎంత గొప్పదో కదా!
మాతృప్రేమల మహిమాన్వితమై
తల్లి ప్రేమ ముందు తల వంచిన ...
పంచతంత్రములో మనసు మార్చుకుని
పరితపించి పిల్ల తల్లి గోమాతను వదిలి
ఠీవి ప్రదర్శించిన మృగరాజులా...
పిసరంత కరుణించి పిల్లను తల్లిని వదిలి
గుండెలు పిండే ఘడియలు తప్పించమని
గుంభనమైన గుణములనివ్వమని...వి నయముగా
వేడెదనే ఆ విరించిని...విశదముగా బోధించ
ఘనముగా ఆ వీర వ్యాఘ్రమునకు....
నగునూరి
No comments:
Post a Comment