రెక్కలు విప్పాలి
తేది : 05-12-2022
శీర్షిక : అనితర సాధన
కవిత సంఖ్య : సహస్రాధికం
విచ్చుకుంటేనే వినీలాకాశంలో
విహంగమై దృశ్యమానమయ్యేది ...
మానవత్వపు మల్లెల సౌరభాన్ని
ఎల్లరకు చిలకరిస్తూ పలకరించేది ....
లుబ్దముతో నేడది దాచుకున్నా
స్వార్థానికి రేపది నిరుపయోగమే ...
కాలంతో పాటుగా కదం కలిపి
నడవడమే సార్వజనీనత ...
ముడుచుకుంటే అలా పెరగిపోయి
విచ్చుకుంటే ఇలా తగ్గిపోయేవి కావు...
విధాత తలపుల విడిది చేసే
విచిత్రమైన జీవులం మనం ...
గమ్యమెరగని పయనమములో
గమనం తప్పదు ఎప్పుడైనా ...
క్షణకాలపు పరిమాణంలో నావ
మునిగితే కన్నీళ్లే నమ్ముకున్నోళ్లకు ...
అంగలార్చి విచ్చుకుంటేనే
అయినవారి ముఖాలలో వెలుగు...
అనితరమై సాధించే గెలుపు
ఆచంద్రతారార్కమై నిలుపు...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment