అంశం : రంగనాయక్ సాగర్
11-11-2022
శీర్షిక : బంగారు తెలంగాణ అడుగులు
గల గలల గంగమ్మ కదిలిపోతుంటే
విలవిల మనమంతా కుమిలిపోతుంటే
వలస పాలకులు వింత పోకడలతో
వంత పాడిరి సవతి ప్రేమలతో ....
నీళ్లు నిధులు నియమాకాలంటూ
నిగ్గదీసి నిలిచిన ప్రజలకు నిజమైన పండగ
పల్లానికి ప్రవహించే నదీమతల్లిని
పబ్బతి పట్టి నిలిపిరి ప్రజాసంక్షేమమై ...
విశ్వంలోనే వింతైన ఎత్తిపోతల
కొలరాడో మ్యాన్ మేడ్ ల సరసన చేరే...
ప్రపంచ ప్రఖ్యాతిని మూటగట్టుకుని
తెలంగాణా ప్రజలందరినీ ఠీవిగా నిలబెట్ట ....
కదిలిపోతున్న కన్నతల్లి గోదారమ్మకు
కనికరించుమని వేడుకుంటూ ...
మేడిగడ్డలో నిలువరించి కాళేశ్వర నామంతో
అన్నారం సుందిళ్ల ఎల్లంపల్లిలకు పంపించి
నంది మేడారం రామడుగుల మీదుగా ...
సయోధ్యతో మధ్య మానేరుకు మళ్లించి
అనంతగిరుల మీదుగా ఆవరించి జల్లులు
జల్లులుగా ... మల్లన్నసాగర్ లో ఘల్లుమనిపించే ...
కొండపోచమ్మకు అండగా నిలిచి
తెలంగాణ మెదక్ నల్లగొండ మాగాణుల
బంగారాలు పండించ ....
కాళేశ్వరం ఎత్తిపోతలకే తలమాణికమై
అత్యధిక 50 టి ఎం సి ల నిల్వలతో
నది లేకుండా నడచివచ్చిన రంగనాయక సాగర్
ఉవ్వెత్తున పొంగగానే ఉరకలేసే
పచ్చని తివాచీలై పరుచుకోగా ....
చుట్టుముట్టు భూగర్భజలాలకు
భూమితల్లి జలధారల అభిషేకించగా
కర్షకుల కళ్లన్నీ చెమ్మగిల్లి పోయే ...
రాయిరప్పల నేలంతా రాగాలు తీస్తూ
పుచ్చపువ్వోలె పచ్చబంతులై మెరుస్తుంటే
బక్క చిక్కిన గొడ్డు గోదలన్నీ
తృప్తిపడి దీవిస్తున్నవి ...
కల్వకుంట్లవారి పట్టుదలలకు
తన్నీరువారి ధృఢదీక్షతలతో
తాగునీటికి సాగునీటికి భరోసాలాతో
తెలంగాణా బంగారు వర్ణాలను
సంతరించుకుంటున్నది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment