దానికి ఒక లెక్కుంది
తేది : 28-12-2022
శీర్షిక : సృష్టి ధర్మం
కవిత సంఖ్య : సహస్రాధికం
దానికి దీనికి అనే తేడా లేదు
ప్రాణమున్నా ప్రాణం లేకపోయినా
ప్రదర్శితమైనా కాకపోయినా
సృష్టిలోని ప్రతీ దానికి లెక్కుంది..
ఋతువులతో బతుకులల్లుకునే
చెట్లకు ఏ క్షణానికి ఎన్ని ఆకులుంటాయనే
విధంగానే ... మనకు తెలిసినా ..
తెలియక పోయినా ....ప్రతీ దానికి ఒక లెక్కుంది ....
చెట్టుకు పుట్టకు గుట్టకు వాగుకు
వంకకు సృష్టిలోని ప్రతీదానికి
అక్షరాస్యతలకందనిది... అంకెలకు
చిక్కనిది ... చర్యకు ప్రతి చర్యగా ...
కనుల ముందు కదలాడే కాలుష్యాల
ప్రభావాల మనిషికి కడివెడు మంచినీరు
కూడా దక్కనీయని ...బహు చక్కని
ప్రత్యక్ష ఉదాహరణం...
అన్నీ తెలుసనుకుని ఆనందపడే
మనిషికి తెలిసినవే కొన్నే ...
తెలియనివి ఎన్నో ఎన్నెన్నో ...
అంతరంగపు మంతనాలలా…
ఆలోచనల తరంగాలలా….
దూరపుకొండల నునుపులలా ...
సంకల్పం మాత్రమే మనదని
సాధనల తదుపరి ఫలితాల్లో
ఎప్పుడైనా జయము అపజయము
అతీతమైన శక్తి మీదనేననే లెక్కలా ...
చరితలు చెప్పిన విశేషాలనన్నింటిని
క్రోడీకరించుకోకుండా…చాదస్తామం టూ
కొట్టిపడేస్తూ…చెవికెక్కించుకోక ...శాస్త్రీయ
చక్షు సాక్ష్యమంటూ… చంకలు గుద్దుకునే
కొంత మంది వితండ వాదులకు వింతేమో
కాని అదే పరమ సత్యం…
నగునూరి రాజన్న
కరినగరము (రిచ్మండ్)
No comments:
Post a Comment