కాలమే జవాబు
తేది : 13-12-22
శీర్షిక: కొన్నింటికి ...
గీత బోధనల సారాంశంగా
బాధలతో బందీ అయిపోకుండా ...
బాధ్యతలు నిర్వహణలో భుజం కలిపి
ఫలితాన్ని కాలానికి వదిలేయాలి ....
సాలెగూడులో బందీ అయిన విధంగా
పరిస్థితుల పంచన కలిసి రాకపోయినా ...
అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తాలు
అందకపోయినా ..నిబద్దతను సడలవద్దు ...
అడుగడుగున కష్టాలను ఈదుతూ
అన్నీ కలసి వచ్చాయనుకునే ఆఖరి నిమిషం
అరక దున్నే రైతన్నకు పంట చేతికొచ్చే
ప్రతీ సారి పరీక్షే .... అకాల వర్షములా ...
అనగ అనగ రాగమతిశయిల్లు లాగ
పట్టుదలతో ప్రయత్నిస్తూ పోతూంటే
కాలం కల్సి వస్తే తప్పక కాంతివంతమై
చీకటి తీరం దాటుకుని వెలుగులు చోడోచ్చు ..
నిరాసక్తతలను గిరాటు వేసుకుంటూ
ఆశావాదాలను ఆత్మీయంగా అల్లుకుంటే
సాధనమున పనులు సమకూరు ధరలో లా
మంచిని కోరుకుంటూ ముందుకు సాగడమే ..
తథాస్తు తప్పక తోడై నిలుచు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment