అంశం - కలి కాలం
తేదీ - 31-07-2019
శీర్షిక - యథా రాజా తథా ప్రజా ....
సంఖ్య - 250
ఒంటి కాలుపై నిలిచిన ధర్మం
ఇంటి నుండే ఇరుకు పరిస్థితి...
అవిభాజ్యాల అలికిడి లేదు .... సరికదా !
అమ్మా నాన్నలే బరువవుతున్నారు.....
ఆశ ఉంటే ఉన్నతమైన
ఆశయాలు ఏర్పరుచుకోవచ్చు.... కానీ !
అత్యాశ పేరాశలతో స్వార్థాలు పెంచుకుని
కపటం మోసాలతోనే సావాసం చేస్తున్నారు....
నమ్మకంతోనే నడుస్తుంది
ప్రపంచమంతా అంటుంటారు.... అంతా హుళక్కే !
తమ పర బేధాలసలే లేవంటూ
నమ్మినవారినే నట్టేట ముంచుతున్నారు ....
మనిషి హోదా పెరిగితే
ప్రవర్తన ఉదాహరించబడాలంటారు ..... మాయ !
పౌరులు పాలకులైతే
పచ్చ నోట్లే చలామణి అవుతున్నాయి.....
యథా రాజా తథా ప్రజా
ఏమిటో ఇప్పటికి కానీ బోధపడింది .... అవతారం !
గుర్రమెక్కి కత్తి పట్టింది
కలి మాయలో పడిందన్నమాట.....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం USA)
No comments:
Post a Comment