అంశం: నల్లేరు పై నడక
తేదీ : 07 -08 -2019
శీర్షిక : నవనాడులు కదలాల్సిందే....
సంఖ్య : 256
ఒడిదుడుకుల బాటల పయనం
కాలానుగుణమై కనికరించు సమయం
ఏ తోడైనా అందుట గగన కుసుమం
అందుబాటులతో సర్దుట వివేకం......
అదే కదా మానవ జీవన సారం ......
ఆత్మీయమైన కుటుంబంగా మలచుకుంటే
అనువైన కుటుంబ పరిస్థితులు పొందవచ్చు....
అరమరికలు లేని మిత్రుడు దొరక్కపోవచ్చు .....
అనుకున్న సంఘ వాతావరణం ఉండక పోవచ్చు ....
అయినా మార్గమేర్పరచుకుని సాగుటే కర్తవ్యం......
తలరాతలనీ .... తలపోస్తూ విచారించకు
తనను మాలిన ధర్మం లేదని గుర్తించు....
అభివృద్ధిని ఆకాంక్షిస్తే అనితరాన్ని శాసించు
అందివచ్చే అవకాశాలను అక్కున చేర్చుకో....
విధి వ్రాతలను విదిలిస్తే విజయమేనని నమ్ము .....
ఆరుగాలం కష్టించనిదే అంబానికైనా ఇబ్బందే...
అందమైన జీవితం అంటే అంత సులభమేమి కాదు
నల్లేరుపై నడక కావాలంటే నవనాడులు కదలాల్సిందే....
ఎన్ని తాకులు తాను తిన్నదో ఎవరికెరుక ....
నానుడై నలుగురికి చేరాలన్న ప్రక్రియలో .....
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment