Friday, August 2, 2019

ఇదీ సంగతి

అంశం - ఇదీ సంగతి
తేదీ - 30-07-2019
శీర్షిక - జరుగుతున్న జమానా..... 
సంఖ్య - 249 

చెమటోడ్చి చంద్రుని మీద చేరినా 
చెద బుద్దులు మారపోతేలా ?

గడియకో మాట చెప్పెటోళ్లే   
గవాయి లేకుండ..... నాయకులాయె ..... 

గనులు మింగిన ఘనులు 
గల గల నవ్వి  ... ఫొటోలకు ఫోజులిచ్ఛే .... 

కోట్లు మింగిన కోడెనాగులు 
కోటలో పాగా వేసే .....కుర్చెక్కి తొక్క... 

ఇచ్చింది మేమేనంటూ 
ఇల్లెక్కి కూసినా ...... ఇమడలేదు జనానికి ..... 

తెచ్చింది మేమేనంటూ 
తెల్లార్లు జెప్పినా .....  తేరుకున్నది లేదు .... 

తెలివికల్లోడు తెడ్డు కదిలించి 
ఒడ్డుకు చేర్చింది ....... నేనే అన్నడు ...... 

ప్రతిదీ పాశ్చాత్య మంటారు గాని 
ప్రజా పాలన రాదెందుకో..... లంచం లేకుండా.... 

విద్య, వైద్యాన్ని గుర్తించే 
విదురుడు రాడాయే ....... ప్రధానావసరాలుగా .... 

లంచగొండి తనాన్ని తరిమే 
లవర్బాయ్స్ రావాలి........... యువత ......... 

అవినీతిని అంతమొందించే 
ఆదిమానవులు కదలాలి...... స్వచ్ఛ మనస్కులు.....

పర్యావరణం పరిరక్షించే 
పెద్ద మనసు కావాలి .........ప్రజా  పరిణతి......
ఇదీ సంగతి చిత్తగించ విజ్ఞులు.......

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం USA)

No comments:

Post a Comment