అంశం : గుండె తడి
తేది: 09 -08 -2019
శీర్షిక: నా గుండె తడి
సంఖ్య: 258
ఉదయతపూర్వపు శుభోదయం
ఊరు వాడల్లో జరిగే దైనందినం
ఉసురు తీసే వార్తల ఉల్లేఖనం
ఉలిక్కిపాటే అంతా ప్రతీ క్షణం.......
తల్లి పిల్లకు పాటించని బేధం
తర తమ భేదమెరుగని మృగం
తల్లడిల్లు సామాన్య మానవ నైజం
తరిమి కొట్టాలనే అందరి తపనం ........
ఏ రోజేమిటో అనే ఉత్కంఠం
ఎవరు మూలమని అన్వేషణం
ఎలా దొరుకుతుందో న్యాయం
ఎందుకో ప్రశ్నిచుకోలేని దైన్యం......
పాలకుల విత్త పక్షపాతం
ప్రాధికారుల నిత్య అలసత్వం
శిఖండి పాత్రల ఇతోధికం
శిక్షల అమలులో ఉపేక్షకం.....
కలి ధర్మంలో ఒక్క పాదం
కనికరించదా ఈషన్మాత్రం
కబళిస్తుందా మానవాళిని సాంతం
కదిలి పోతుంది నా గుండె తడి సైతం.....
No comments:
Post a Comment