అంశం - నదీ జలాలు
తేదీ - 27-07-2019
శీర్షిక - కన్నతల్లిగా కాచుకున్నవి....
సంఖ్య - 247
తేదీ - 27-07-2019
శీర్షిక - కన్నతల్లిగా కాచుకున్నవి....
సంఖ్య - 247
భూమి గుండ్రమన్నంత సత్యం!
సాగరుడి నుండి సాగిన ప్రస్థానం
తిరిగి సాగరునిలోనే ఐక్యం ......
పంచభూతాలెప్పుడు పరోపకారమే!
పల్లపు నీరు సైతం ఊర్ధ్వము చేరు
పచ్చిక బయళ్లను పరుచును నేల .....
కొండ కోనల్లోన పాయలు పాయలు!
కోటి మైళ్ళ మైదాన ప్రయాణాలు
చెట్టు చేమకు చేరి దట్టమైన అరణ్యాలు ...
మానవాళి నాగరికతలకు మూలం!
తాగు నీరై తడిమెను అవని భూగర్భ జలం ....
సాగు నీరై నిలిపెను హాలికుని గుండె ధైర్యం ....
ఆచార సంప్రదాయంతో ఆపాదించెను దైవత్వం!
పునీత ప్రదేశాలు పుణ్య క్షేత్రాలు సాక్ష్యం
జీవితాన ఒక్కసారైనా మొక్కాలని పుష్కరం......
యుగ యుగాలుగా సాగుతున్న చక్రం !
యుగం మారినా తప్పని ఉపకార ధర్మం
గనులనేకం మానవాళికి భూమాత గర్భం....
అయినా మారని మానవ దృష్టి కోణం !
కడుపున పెట్టుకుని కన్నతల్లిలా చూచినా
కాలుష్య కాసారాలుగా మార్చుతున్న వైనం ....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment