Friday, August 2, 2019

యాత్రలు

అంశం - యాత్రలు
తేదీ 24-07-2019
శీర్షిక - ఆనందం పరమావధి...
సంఖ్య - 244

ప్రతి మనిషి జీవనయానమే మాహా యాత్ర 
అమ్మ కడుపున నవ మాసాల బయలుదేరి 
అవినిపై అడుగిడి అనుభవాల ప్రోదితో  
ఆనందంగా బ్రతుకగలగడం........  

ప్రకృతితో మమేకమైన మనిషికి 
పరుగులు లేని ప్రశాంత జీవనం 
పనిలోనే పరమాత్మ దర్శనం...  

నాగరికతలో నడక నేర్చిన వారికి 
నవ్యత ఉత్సుకతతో  సాగించిన శోధనం 
నడయాడెను మార్గం నిత్యనూతనం .... 

ప్రతి దశలో జీవితాన కలుపుకునెను 
పలు యాత్రల ఫలితాలు వినోద విహారాలు  
విజ్ఞాన విచిత్రాలు  దైవ దర్శనాలు ...... 

అంతు లేనిది వింత విశ్వం  
అమరినంత ప్రోది వివేకం 
ఆనందమైన క్షణాలు జీవితాన ..... 

నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)  

No comments:

Post a Comment