అంశం : భిన్న ధృవాలు
తేది : 06-08-2019
శీర్షిక : భిన్నత్వంలో ఏకత్వం
సంఖ్య : 255
జీవ జాతుల్లోనే వైవిద్యం
మనిషికి మాత్రమే ప్రత్యేకం
జ్ఞాన విచక్షణల విలక్షణం
సాధించిన ఆధిపత్యానికి సంకేతం
శాస్త్రీయతే ఋజువుపరుస్తుంది
అయస్కాంతం అందుకు తార్కాణం...
సంప్రదాయమైనా సర్దుకుంటుంది
వివాహబంధాన విజయమై నిలుస్తుంది ..
బంధమైనా బంధుత్వమైనా బలమే
వితండమవకుండా ఒక్కటిగ కలుప ....
వాస్తవాన ఒకటైతే మిత్రుత్వానికి మార్గం...
వాణిజ్యాన వరమైతే అభివృద్ధికి సంకేతం...
కార్య సాధనలో కనిపించు కమ్మని ఫలితం....
పాలనలో పట్టు చిక్కు చక్కని పరిష్కారం....
అదేకదా మన సువిశాల భారత సూత్రం
రాజ్యాంగపు ఇరుసున భిన్నత్వంలో ఏకత్వం.. ..
ఏడు దశాబ్దాల రక్కసి రూపం...
సాధించాం కదా సంధి మార్గం....
పెక్కు భావాల పాలకుల ఉక్కు భావం
ఒక్కటై అందించెను భూతల స్వర్గపు కాశ్మీరం...
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment