అంశం - తిమిరంతో సమరం
తేదీ - 23-08-2019
శీర్షిక - ముదావహమైన కాశ్మీరం ....
సంఖ్య - 269
పిండి ఆరబోసిన మంచుకొండలు
బహు సుందరం అందమైన లోయలు
అత్యద్భుతం పంచభూతాల రమణీయం
పచ్చ పచ్చని తివాచి లాంటి మైదానాలు
ఆధ్యాత్మికతకు ఆనవాళ్లు దర్గాలు దేవాలాలు
మతాలకతీత జీవన విధానానికి మొగ్గయినా
పొరుగు కన్నుకుట్టి పొగ బెట్టుతున్న వైనం
యువతకు ఉపాధిగా ముష్కర శిక్షణ....
మనిషి బొమ్మ చేయబోతే కోతి బొమ్మైనట్టు
ఎలాగోలాగ ఎదో చేయాలని తాత్కాలికమంటూ
ప్రత్యేక ప్రతిపత్తితో పట్టం కట్టి దూరం పెట్టారు
అంటీ ముట్టనట్టుండి తిమిరంతో సమరమే చేసాం....
తప్పొప్పులు పోగేసుకుని తన్నుకుంటే ఎలా....
దశాబ్దాల దమనకాండకు చరమగీతం పాడి
మూడు వందల డెబ్భైకి తిలోదకాలు ఇచ్చి
వేర్పాటు వాదానికి తోడ్పాటు లేకుండా చేసి
అందరం కల్సి ఉందామనే ఆశయంతో అడుగేసాము.....
తాత్కాలికం నుండి తన్నుకు చచ్చే దాకయ్యింది
దేర్ హై మగర్ అంధేర్ నహీ చందంగా
ఉక్కు భావంతో ఒక్కటై శాసనం చేశారు
మీకు మేము... మాకు మీరంటూ...
ముదావహమైన కాశ్మీరాన్ని స్వాగతించాము....
No comments:
Post a Comment