అంశం - ఆత్మ సౌందర్యం
తేదీ - 28-06-2019
శీర్షిక - గుండె లోతుల్లో వినిపించే శ్రావ్యం ...
సంఖ్య - 273
పల్లె బంధాల పలుకులు పోయి
పట్నపు అందాల బతుకులాయే
పలకరింపులకే సమయం లేదాయె
పసిగట్టుడెట్లా మనుషుల మంచి చెడులు....
నిలబడితే కనబడుతుంది బాహ్యసౌందర్యం
మాట్లాడితే తెలుస్తుంది అంత:సౌందర్యం
మాట కలుపకుంటే తెలిసేది ఎలా ?
మనుసు ఎట్లాంటిదో సృషించేది ఎలా?
యుగ ధర్మమో లేక కలి మాయానో...
కలిసి బతుకుడు పక్కనబెడితే
సాంకేతిక విప్లవం పుణ్యమా అని
సాటి వారితో మాట్లాడుడే కరువైపోయింది...
ఫేస్ బుక్కంటూ ఇన్స్టాగ్రామంటూ
వాట్సాప్పంటూ స్కైపులంటూ కైపెక్కుతున్నారు ...
సాంకేతికత సౌకర్యమని సంబరపడే లోపే
మనిషి నీడే మహమ్మారిగా మారి...
సైబర్ నేరాల కత్తి సర్రున దిగుతున్నది ....
మనిషో... నీడో ... భ్రమించకు
శ్రమించి చూడు మనిషిని.....
క్రమంగా మాట్లాడు .....కనిపెట్టు....
గుండె లోతుల్లో వినిపించే శ్రావ్యాన్ని.....
ప్రతిధ్వనించే ఆత్మ సౌందర్యాన్ని......
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment