Friday, August 2, 2019

రైలు ప్రయాణం 2

రైలు ప్రయాణం  2

బండి రాగానే పడరాని పాట్లు
కూర్చునే సీట్లకై సాగించే ఫీట్లు ....

నడుస్తున్న రైల్లో కూర్చుని చూస్తే
అన్నీ వెనక్కి పరుగెడుతున్నట్టే...

వీనులకు విందుగా వినిపించే సౌండ్స్
చాయ్  కాఫీ  ఇడ్లీ  వడ  దోస ....

కళ్ళు మూసుకుని పడుకుంటే  
జోల పాడి  ఊయలలో ఊపినట్టు....  

పొట్ట పాట్లకై వచ్చి రాని సంగీతాలతో
పాట పాడి మెప్పించే ప్రయత్నాలు.....

పరిచయాలే  లేని ప్రయాణ  మిత్రులు
పట్టు పట్టుమని  తినమనే బలవంతాలు....

పట్టు చాలని జనసాంద్రతల పట్టణాలోలె 
ప్రతి పెట్టె ఓ నిండు గర్భిణీ చందాన..... 

ప్రతీ ప్రయాణం ఓ తీపి జ్ఞాపకమే  
తిరిగి మళ్ళీ ప్రారంభించేంత వరకు .... 


నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

No comments:

Post a Comment