అంశం - కిట్టీ పార్టీ
తేదీ - 2507-2019
శీర్షిక - సూక్ష్మ మార్గదర్శకం....
సంఖ్య - 245
మేమిద్దరం మాకిద్దరు చందం కుటుంబాలు
తేదీ - 2507-2019
శీర్షిక - సూక్ష్మ మార్గదర్శకం....
సంఖ్య - 245
మేమిద్దరం మాకిద్దరు చందం కుటుంబాలు
పట్టణ సంస్కృతి ఫరిఢవిల్లుతున్న ఛాయలు
ఇద్దరు ఆర్జిస్తే తప్ప దాటని ఇరుకు పరిస్థితులు
పురుష పుంగవులకు దీటుగా నారీమణుల వేదిక
అలసి సొలసిన అతివలకు అప్పుడప్పుడు ఆటవిడుపు
సంసార సాగర జీవితాన సదా కుటుంబ సందళ్లే ...
సామాజిక ఆర్ధిక రుగ్మతలను అవపోశన పట్టే కార్యశాల...
సామాజిక ఆర్ధిక రుగ్మతలను అవపోశన పట్టే కార్యశాల...
చిరు సరదాలకు చిన్న చిన్న పొదుపులకు చిరునామా ...
చేయి చేయి కలుపుదాం చేతనైనది చేసేద్దాం
మాట పంచుకుందాం మంచి ఆలోచన నిలుపుదాం
ఒకటిగ చేయలేనిది ఉమ్మడిగా చేసేద్దాం...
బేల బెరుకు బతుకులకు చరమాంకం
స్వావలంబనలకు స్వాగతాంకురం .....
ఉరుకుల పరుగుల జీవితాలలో ఉపశమన శిబిరం
సంఘములో తమను తాము విశద నిరూపణకు తార్కాణం.....
అనేక కారణాలతో అచేతనమైన ఉమ్మడి కుటుంబాల ఉనికి
ఆర్ధిక ఆలోచనలతో సహ జీవన సంతులతలకు సంకేతం
కొత్త బంధు మిత్ర బలగాల అల్లికలకు తీగ మల్లికలు
కష్ట సుఖాల కబుర్ల కలబోతలకు అద్దుకునే లేపనాలు
కలహంస కూటముల దీక్షా శిబిరాల నందనవనం
ఉన్నత జీవన ప్రమాణాల ఉనికి పోరులో ఉద్యానవనం...
ఉమ్మడిగ గెలిచి నిలిచే సూక్ష్మ మార్గదర్శకం....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment