అంశం - బృందావనం లేదా ఉట్టి
తేదీ - 24-08-2019
శీర్షిక - నల్లనయ్య గుర్తు ....
సంఖ్య - 270
శ్రావణ శుద్ధ అష్టమీ రోహిణీ నక్షత్ర యుక్తం
పరంధాముని అష్టమ అవతారం
పరమ పుణ్యం ఆతని కారణ జన్మం
మధురలో ఉద్భవించిన మాధుర్యం
చెరసాలలో జన్మించిన బంధ విముక్తం
మాయా మోహితం రక్షణ వలయం
ప్రకృతే పరవశం యమున గమనం
నందయశోదమయం ఆనంద గోకులం
కంస చాణూర పూతన అసురాది సంహారం
చిలిపి బాలుడు చిన్ని కృష్ణుడు
ఉట్టిన పెట్టిన పెరుగు వెన్నల దొంగ
గోపాలురతో ఆడిపాడిన గోపబాలుడు
గోవుల కాపరి మా అల్లరి నల్లనయ్య....
కాళీయ మర్దనం తాండవ కృష్ణం
గోవర్ధనగిరి నెత్తిన ఇంద్రగర్వభంగం
అల్లరితో అలరించిన అనంతుడు
వేణువుతో మురిపించిన వేణు మాధవుడు
బృందావన విహారి నంద నందనుడు
రాధా మనోహరుడు రమణీయుడు
అమలిన శృంగార సుందరాంగుడు
నిధివాన్ కు వచ్చే అధినాయకుడు
పార్థునికి సారధి అయిన పరమాత్ముడు
ధర్మ రక్షణార్థాయ బలరామ కృష్ణుడు
తత్వబోధకుడు తాత్వికుడు గీతాచార్యుడు
వ్రేపల్లె చేరిన శంఖ చక్ర గధ శారంగ ధారి
దుష్ట శిక్షణార్థాయ శిష్ట రక్షణార్థాయ
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే...
గుర్తుగా అంబరాన్నంటే సంబరమే
బృందావనం... ఉట్టి పండగ ....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment