అంశం - చంద్రయానం
తేదీ - 01-08-2019
శీర్షిక - మన మామ
సంఖ్య - 251
అమ్మ చూపించి అన్నం తినిపిస్తే
అందులో ఏముందోనని ఆరాటం....
పేదరాశి పెద్దమ్మను పలుకరిద్దామని
అగ్రదేశాలతో పోటీ మనం సైతం
చల్లని వెన్నెలలకు నిలయం
చక్కని కవిత్వాలకు మూలం
అందమైన ఊహలకు కేంద్రం
సుందరమైన పోలికలకు ఊతం
సృష్టిలోనే విశిష్టం మానవ జన్మం
సృజన వైవిధ్యం సుందరం
శోధన సాధన మానవ మేధం
అన్వేషణలోనూ అనితరం .....
భూమి గుండ్రమని... గ్రహాలని...
ఉపగ్రహాలని.... పాలపుంతలని... ...
పరిసరాలన్నీ శోధించడం మానవ లక్షణం
పట్టుబట్టి నిర్దారించుకోవడం మానవ నైజం....
భూమి తన చుట్టు తాను తిరిగి
సూర్యుని చుట్టూ తిరిగిన చందం
ఖండాంతరాలు దాటిన మానవుడు
గ్రహాంతరంగానికెదుకుతున్న వైనం ..
పుట్టు పూర్వోత్తరాలు మేనమామకు తెలిస్తే
మేనమామ మూలాలు వెదికి వెలికితీయ
చంద్రయాన్ 2 ని పంపే జి ఎస్ ఎల్ వి ద్వారా
ఆసాంతం విజయం చేకూరాలని ఆశిద్దాం ....
No comments:
Post a Comment