అంశం - రక్షా బంధనం
తేదీ - 14-08-2019
శీర్షిక - ఒకరికొకరు రక్ష....
సంఖ్య - 261
ఇంటింటికి అమ్మాయుంటేనే
ఇలవేల్పు రక్షణ శక్తిస్వరూపిణిగా...
అన్నింటా అమ్మాయిలుంటేనే
ఆదిలక్ష్మి రూపం ఆదరణ అందరికి.....
ఆత్మీయమైన అనుబంధాలకు
అవ్యాజమైన అనురాగాలకు
అజరామరమైన బాంధవ్యాలకు
అనితర సాధనం రక్షాబంధనం....
తోబుట్టువుల పవిత్ర బంధాలకు
తోడుండు శక్తి స్వరూపిణియై స్త్రీ రూపం .....
అండదండలనందిస్తూ అసలు సిసలైన
ఆనందాలను వెదజల్లేదే రక్షాబంధనం.....
జగములేలే జగన్నాథ బలభద్రులకు
సుందరమైన బంధం సుభద్రమ్మ....
హరి హరులకు ఆన నిలిచిన సోదరీమణుల
బంధమన్నదే పురాణాల సాక్ష్యం ....
ఆది పరాశక్తి పార్వతి...ఆదిలక్ష్మి అమ్మవార్లు....
శుభం లాభం సోదరులకు
సుందరమైన రక్ష కట్టె
సుగుణ రాశి సంతోషిమాత గణేశ తనయై ..
దైవికాన సోదరాయె ద్రౌపదమ్మ
వలువ చించి ప్రేమ పంచి శ్రీకృష్ణుడికి....
శాస్త్రమయినా సంప్రదాయమైనా
సమ్మతమైన నమ్మకముంటేనే...
ధర్మమైనా న్యాయమైనా
నలుగురికి రక్షణ పంచితేనే ....
No comments:
Post a Comment