17-08-2019
శీర్షిక - మిషన్ భగీరథ
దశలు దశలుగా దశాబ్దాలుగా
పలు రకాల మానవ తప్పిదాల
పర్యావరణం కలుషితమాయె...
పచ్చని అరణ్యాలు అంతరించి
ప్రకృతి సమతుల్యత పతనమై
కరువు రక్కసి కోరలు చాచె....
అవిభాజ్య రాష్ట్రములో అన్నీ ఉన్నా
అల్లుని నోట్లో శనిలాగ పాలకులు
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణంటే తేడానే....
నీళ్లు నిధులు నియామకాలంటూ
నిగ్గదీసిన ధీశాలి మన కెసిఆర్ మలి పోరాటం
నిలిచింది అండగా సకల జనుల సమ్మెగా.....
అనుకున్నది సాధించి అధికారం చేపట్టి
ఆలసింపక అడుగులేసే అద్భుత పథకంతో
అపర భగీరథుడై స్ఫురద్రూపి సూక్ష్మగ్రాహి....
ఉద్యమాన్ని ఉరికించిన రీతి పథక పురోగతి
ఉదుటున సాధించె అనేక అనుమతులు
ఉవ్వెత్తున సాగించె ఆనకట్టల నిర్మాణాలు....
పాలకుల దీక్ష దక్షతల మానస చిత్రానికి
పలు ఇంజనీర్ల మేథో మధనాన్ని జోడించి
వేలమంది శ్రామికులు అహోరాత్రులు శ్రమించె .....
ప్రణాళిక,పర్యవేక్షణ,లక్ష్యాలలో రికార్డులెన్నో తిరగ రాసి
ప్రముఖుల అభినందనలను పదిలపరచి
పక్క రాష్ట్రాలకు ఉదాహరణగా నిలిచింది ......
ప్రాణాధారమున త్రాగునీరు ద్వితీయమైనా
ప్రభుత్వమేమో ప్రజలకోసం ప్రధానమన్నది...
స్వచ్ఛమైన తపస్సుతో తాగునీరందించి
ఉచ్ఛమైన స్థానాన్ని పదిలపరుచుకున్నది.....
పశ్చిమ కనుమల్లో పురుడు పోసుకున్న గోదారమ్మ
మనందరి పాలిట నిలిచింది కల్పవల్లి బంగారమ్మగా .....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment