అంశం - శ్రావణ మాసం 2019
తేదీ 02-08-2019
శీర్షిక - సందళ్ళ మాసము
సంఖ్య - 252
శశిని చేరిన నక్షత్ర నామం
శ్రావణమై వర్ధిల్లె శ్రావ్యమై
మెండు వర్షాలతో నిండు చెరువులు
మెరయు పచ్చంగా అవని మేనంతా...
సూక్ష జీవుల బెడద చాలటంచూ
శుచి శుభ్రతలకు పెద్ద పీట చూపె ......
పిల్ల పాపలంతా క్షేమముండాలని
ఆచార్య వ్యవహారాలన్నీ ఆధ్యాత్మికమయ్యే ....
ఆరోగ్యానికి బహు మేలటంచు
ఆరు బయట నదీ స్నానాలు
అందరు కలిసిన వనభోజనాలు
ఆలయాల సందర్శనలు ఆచరింతురు .....
మాసమంతా శోభాయమానమే
మహిళలకు వ్రతములు నోములంటూ
వరములిచ్చే తల్లి వరలక్ష్మిగాను
మాంగళ్య సౌభాగ్యాల మంగళ గౌరీగాను.....
అన్నదమ్ముల పైన ఆత్మీయతలు చాటి
అక్క చెల్లెళ్లంతా అనురాగ బంధంగా
అందరికి రక్ష కోరి కట్టేదే రక్షా బంధనముగా ...
అందునా కొందరికి జంధ్యాల పౌర్ణమిగా
దేశమంతా స్వాతంత్య్ర జెండా పండుగై
అజరామరమై నిలిచే ఆచంద్రార్కముగా....
నల్లనయ్య నంద గోపాలుడు
గోపికా వల్లభుడు గోపాల కృష్ణుడు
గీత బోధకుడు ధర్మ రక్షకుడు
కృష్ణాష్టమి వేడుకలు ఈ మాసమందె ....
No comments:
Post a Comment