అంశం - నిచ్చెన
తేదీ - 26 -07 -2019
శీర్షిక - అభివృద్ధికి సంకేతం ...
సంఖ్య - 246
అడ్డంకులను అధిగమించ
ఆలోచనలను పేర్చి అమర్చె
అచ్చెరువున వెదురు తాళ్లతో
అడుగేసి నాగరిక సవ్వడితో....
కల్మషాలు ఎరుగని నేను
కర్రలతో ఎదిగాను చూడు...
చింతలను చిత్తు చేసి
మనిషిని ఎత్తులకు చేర్చ ...
చెట్టు చేమలనుండి పుట్టినా
బెట్టు చేయక నేను కట్టుబాటుగ
ఎల్లవేళలా కనిపెట్టుకుని
పట్టుగలిగి నిన్ను పైననిలబెట్టా ....
కర్షకుడైనా కార్మికుడైనా
కనిపెట్టుకునే ఉంటాను...
ధనిక పేద దమననీతిని
దరిదాపులకు రానివ్వను....
ఊహ పెరిగిన మానవుడు
లోహపు జాడ పట్టినా ....
అనుకూలాలకు దన్నుగా
ఆద మరిచి నిలిచాను.....
పరమపద సోపాన క్రీడన
ప్రయత్నించి ఎక్కే మెట్టు
ప్రగతి పథాన మానవాళికి
పథం నిర్దేశించే కనికట్టు ....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
తేదీ - 26 -07 -2019
శీర్షిక - అభివృద్ధికి సంకేతం ...
సంఖ్య - 246
అడ్డంకులను అధిగమించ
ఆలోచనలను పేర్చి అమర్చె
అచ్చెరువున వెదురు తాళ్లతో
అడుగేసి నాగరిక సవ్వడితో....
కల్మషాలు ఎరుగని నేను
కర్రలతో ఎదిగాను చూడు...
చింతలను చిత్తు చేసి
మనిషిని ఎత్తులకు చేర్చ ...
చెట్టు చేమలనుండి పుట్టినా
బెట్టు చేయక నేను కట్టుబాటుగ
ఎల్లవేళలా కనిపెట్టుకుని
పట్టుగలిగి నిన్ను పైననిలబెట్టా ....
కర్షకుడైనా కార్మికుడైనా
కనిపెట్టుకునే ఉంటాను...
ధనిక పేద దమననీతిని
దరిదాపులకు రానివ్వను....
ఊహ పెరిగిన మానవుడు
లోహపు జాడ పట్టినా ....
అనుకూలాలకు దన్నుగా
ఆద మరిచి నిలిచాను.....
పరమపద సోపాన క్రీడన
ప్రయత్నించి ఎక్కే మెట్టు
ప్రగతి పథాన మానవాళికి
పథం నిర్దేశించే కనికట్టు ....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment