మార్దవం
తేది 31 -03 -2020
శీర్షిక - మార్దవం మచ్చు తునక
సంఖ్య - 381
ఆటవిక సంపదల అలంకృతం
ఆత్మీయతలకు కొలువైన నిలయం
అక్షర సరస్వతి ఆలయ పరిసర క్షేత్రం
అత్యంత విశాల అవిభాజ్య ప్రాంతం....
వందల పుస్తకాల వస్త్రగాలితం
సంతులిత సమీక్షల సంపదల గని
కాలమిస్ట్ నుండి కవిత్వం కథలు నానీలు
కథలతో కవన రంగాన నిలిచిన కలికితురాయి....
అలతి అలతి పదాల కూర్పుతనం
అందమైన భావగణాల విరుపులు
సుందరమైన విషయ సంపదలు
మానవీయ కోణపు ఆవిష్కరణల సృశింపులు....
స్వతహాగా సాహితీ పుత్రుడైనా
ప్రత్యక్షంగా పరోక్షంగా స్ఫూర్తి నింపుతూ
సాహితీ సభలకే విలువైన సమయ కేటాయింపుతో
మాతృ భాషపై మమకారం చాటిన మేటి....
మనిషిలోన మాటలోన సంతులనం
రచనలోన సమీక్షలోన సద్విమర్శల మార్దవం ...
నడుస్తున్న చరిత్రలో మార్దవానికే ప్రత్యక్ష సాక్షి
మార్దవానికే మచ్చుతునక మన గురువు గారు.....
నగునూరి రాజన్న
హైద్రాబాదు
No comments:
Post a Comment