శీర్షిక : కాలం మార్చిన కథ... (8)
తేది :16-04-2020
భారతీయమంటే బహుపురాతనం
కాదని ఒక్క నమస్కారంలోనే
సమస్త జీవన సంస్కారం ఇమిడిన
భవ్యమైన విధానమని నిరూపితం ..../.
కాసుల వేటలో కనికరాలు మరిచి
కఠిన పాషాణమై చోద్యం చూసిన వైద్యం
కాదని మానవత్వం నెత్తికెత్తుకుని
ఆరాధ్యాలు అందుకుంటున్న వైనం ..... /
భక్షకులు రక్షకులన్న భ్రాంతిని విడిచి
క్రాంతి విధానమే మా మార్గమని
"జనం కొరకే మనం " అంటూ
జన నీరాజనాలందుకుంటున్న వేళ ..... /
అంటీముట్టని శుభ్రత దూతలు
అనుంగు సోదరులై ఆదుకుంటూ
అహోరాత్రులు కనిపెట్టుకుంటూ
అందలం అధిరోహిస్తున్న శుభవేళ..../
ఛీత్కారాలు చీదరింపుల నుండి
చేమంతులు గులాబీ మల్లెల జల్లుల
సత్కారాలతో సమున్నతమై శోభిల్లుతూ
కాలం మార్చిన కథగా నిరూపితమైన
శుభ సమయం... /
నగునూరి రాజన్న
హైదరాబాద్
No comments:
Post a Comment