సంగీత సాహిత్యాలు
తేది - 03-04-2020
శీర్షిక - నాగరికతకు జవసత్వాలు
సంఖ్య - 384
పరిమళించే ప్రకృతి నేర్పిన ధ్వనుల లయ
పశు పక్ష్యాదుల పరవశాల పలుకులే శృతి
కాలానికనుగుణంగా కదులుతూ
సంగీతం
కమ్మని కళగా ఒదిగినది అరువది నాల్గులో.....
భాషా బేధాల పట్టింపులు రావు
లింగ వివక్షల తారతమ్యం లేదు
జాతి ప్రహారీల అడ్డంకులు నిలవవు
ఎల్లలు లేని విశ్వ సందర్శనం.....
నాగరికత నడకల భావాంతరం
సంఘ సాదృశ్య సంఘటనల రూపం
వివిధ భావ ప్రకటన విస్తృతిలో ఆహార్యం
భాషకు సమ్మోహన ప్రాణం... సాహిత్యం
గుండె గుడి గంటల్లో పొందే తడికి
విచ్చుకున్న వివిధ భావనానుభూతులకు
విడమరిచే సహృదయ వినయ స్పందనలే
పలు సాహిత్య అభిలాష మార్గాలు....
సంగీతం సహజ ప్రకృతి పాఠమైతే
సాహిత్యం భాష పక్వత చైతన్యం
అక్షర జ్ఞాన సమర్థ సంపన్నాలు
కష్ట సుఖాల ఆశల కడలి తీరాలు
సుఖ దుఃఖాల అమృత తుల్యాలు.
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment