కరోనా నేర్పిన పాఠం
07-04-2020
కరుణ ఎరగని కరోనా
కత్తి లేకనే కుత్తుకలు తీస్తున్నది
ప్రాణాలను హరించేస్తూ
ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది....
కరోనా కఠిన పాషాణమైనా
కళ్ళు తెరిపిస్తున్నది మనందరికీ
సంస్కృతి సంపద మననంలో
సంప్రదాయ సమ్మతిలోనే కాదు సుమా ...
అత్యవసరంలో సహకరించకుండా
అలసత్వం ప్రదర్శిస్తూ
అసలు చికిత్సకు దొరక్కుండా
కుటుంబాలను దేశాన్ని వధ్యశిలపై
ఎక్కించడం..... ఎందువలనో... !
నిరక్షరాస్యత కొంతవుతే........ .
నిర్లక్ష్యతే పెద్ద సమస్యయింది
నిర్లక్ష్యతకు మూలం నిరాదరణలేనా ?
అక్షరాస్యతలో .... దేశ సమగ్రతలో..... !
మతసంస్థల మాటవుతే మాకొద్దనే
సంస్కృతికి విశ్రామం చెప్పాల్సిందే....
హిందూ సంస్థైనా గురుద్వారాలైనా ఏదైనా....
పాలనల పట్టు తప్పితే పరిహాసమే కదా!
ప్రభుత్వాలకే ప్రశ్నలు మిగిలితే ఎలా ?
ఒకటొకటిగా చూస్తుంటే
ఒళ్ళు జలదరిస్తున్నది
అనుమతులు లేకుండానే కట్టడాలా ?
ఆజ్ఞలు లేకుండానే విశ్వ సభలా ?
ప్రతి వ్యక్తి కదలికలో
ప్రతి సంస్థ మూలలలో
ప్రజల గమ్యాలలో గమనాలలో ....
నిఘా నీడలు కదలాల్సిందే....
రాజకీయాల రంగులు పులమకుండా
దేశ రక్షణే గమ్యంగా ధ్యేయంగా సాగితే ...
ప్రజాస్వామ్యం పదికాలాలు పరిఢవిల్లుతుంది
భిన్నత్వములో ఏకత్వానికి పట్టు పెరుగుతుంది....
పాలనలు ప్రశాంతంగా సాగించవచ్చు. ....
నగునూరి రాజన్న
హైదరాబాదు.
No comments:
Post a Comment