Saturday, September 1, 2018

తపాలా బ్యాంకు

నగునూరి రాజన్న 
ప్రత్యేక కవిత 
తపాలా బ్యాంకు 
31-08-2018. 

తోక లేని పిట్ట తొంబయ్యారామడ 
ఎరుపు పసుపు రంగుల ఆశల హరివిల్లై,
చిత్తశుద్ధి, శుభ సంకేతాలకు చిహ్నమై, 
అలుపెరుగని ప్రయాణాలకు చిరునామాగా   
ఆర్థిక లావాదేవీల అవతరణలతో ... 
అడుగు ముందుకేసింది.  

1837 లో పరిమితంగా మొదలయినా 
అంచెలంచెలుగా  ఎదిగింది  
అవసరాలకనుగుణంగా మారింది   
కాలానుగుణంగా పరిణతి చెందింది.

పల్లె నుండి పట్నం దాకా 
గల్లీ నుండి ఢిల్లీ దాకా 
ప్రతి మనిషిని పలుకరించింది.  
పడి లేచిన కెరటంలా 
ఎత్తు పల్లాలను చూసింది. 
 
ఆరు జోన్లను  అమర్చుకుని 
ఆరంకెల పిన్ నంబర్లు అక్కున చేర్చుకుని 
అలతి బట్వాడాలకు శ్రీకారం చుట్టింది. 

చవకగా ఉత్తరాలనందించే స్థాయి నుండి 
మని ఆర్డర్ , స్పీడ్ పోస్ట్, పార్సెల్ సర్వీస్, 
సరుకు రవాణా, సాంకేతికత సొబగులద్దుకుని 
వాణిజ్యములో సమకాలీన సమ ఉజ్జీగా సర్దుకున్నది. 



No comments:

Post a Comment