13-09-2018
సంఖ్య : 55
శీర్షిక : అద్దెకు సొంతిల్లు
పల్లె బతుకున వేగం పెరగ
పట్టణాలకు దార్లు అల్లుకున్నయి.
భూముల ధరలు చుక్కలనంట
ఆకాశ హర్మ్యాలై ఆదుకున్నయి.
మార్పు ప్రకృతి సహజమయినా
మనుగడ మానవ అవసరం
అవతరించిన అత్యవసరాల పరిష్కారం
అద్భుత మానవ మేధ పరిణామం.
శివార్ల ఒంటరి బతుకు భయం
కావాలి మనకు రక్షణ సమూహం
ఆదరించక తప్పదు అందరం
పిచ్చుక గూళ్ళ జీవన పయనం
నేలంతా సొంతం కాకపోయినా ..
పైనంతా అధికారం లేకపోయినా...
మధ్యలో మిధ్య బతుకులయినా....
సామూహికంగా సౌకర్యాల కూర్పు.
వాకిళ్లు లేని వసారాలైనా...
సొంతం కాని సౌకర్యాలైనా....
అత్యవసరాలు తీర్చు ఆవాసం.
సొంతింటికి అద్దె చెల్లింపులు.....
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA )
సంఖ్య : 55
శీర్షిక : అద్దెకు సొంతిల్లు
పల్లె బతుకున వేగం పెరగ
పట్టణాలకు దార్లు అల్లుకున్నయి.
భూముల ధరలు చుక్కలనంట
ఆకాశ హర్మ్యాలై ఆదుకున్నయి.
మార్పు ప్రకృతి సహజమయినా
మనుగడ మానవ అవసరం
అవతరించిన అత్యవసరాల పరిష్కారం
అద్భుత మానవ మేధ పరిణామం.
శివార్ల ఒంటరి బతుకు భయం
కావాలి మనకు రక్షణ సమూహం
ఆదరించక తప్పదు అందరం
పిచ్చుక గూళ్ళ జీవన పయనం
నేలంతా సొంతం కాకపోయినా ..
పైనంతా అధికారం లేకపోయినా...
మధ్యలో మిధ్య బతుకులయినా....
సామూహికంగా సౌకర్యాల కూర్పు.
వాకిళ్లు లేని వసారాలైనా...
సొంతం కాని సౌకర్యాలైనా....
అత్యవసరాలు తీర్చు ఆవాసం.
సొంతింటికి అద్దె చెల్లింపులు.....
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA )
No comments:
Post a Comment