తేదీ : 17-09-2018
శీర్షిక : భిన్నత్వంలో ఏకత్వం
సంఖ్య :58
అనుభవాల సారమదే కదా !
కలిసి నిలిస్తే కనుల పంటేనని.....
అడుగు ముందుకేస్తే అందు గమ్యమని ......
ఐక్యతలో లీనమైతేనే కదా !
అనురాగాలు మెండుగ వర్ధిల్లునని........
ఆత్మీయతలు నిండుగుంటాయని.......
స్వార్థాలు వీడితేనే కదా !
సాటివారిని ప్రేమించగలిగేది.
ఇచ్చిపుచ్చుకునే ధోరణే కదా!
ఇనుమడించి నిలుపునది .
అన్నదమ్ములైనా అదే సూత్రం ....
ఆపద,సంపదలకు దన్నుగా నిలవొచ్చు.
అవిభాజ్య కుటుంబాల్లో ఆనవాళ్లు చూడొచ్చు.
ఆసేతు హిమాచలమైన అంతే ...
అచంచలంగా ఎదుర్కొనవచ్చు.
అనేక సార్లు రూఢి పరిచింది.
అదే కదా మన సంప్రదాయం ....
అదే కదా మన సంస్కృతి......
అనేక కుల మతాల అలంకృతం....
భిన్నత్వములో ఏకత్వం.
No comments:
Post a Comment