Monday, September 3, 2018

హరిత హారం

నగునూరి రాజన్న 
అంశం: హరిత హారం 
కవిత సంఖ్య : 32
శీర్షిక :విశ్వ మానవ కళ్యాణం 


అమ్మ మానవ జన్మకు కారణమైతే 
అవని  పోషణకు భరణమౌతుంది. 
అడుగడుగున అండగా నిలుస్తుంది. 
మనలోని పంచ ప్రాణములకు 
పంచ భూతములే సంకేతం. 
మానవుడు ప్రత్యక్షంగా బలవంతుడైన మేధావి
పరోక్షంగా అంతులేని స్వార్థం అలవికాని అలసత్వం.    
మంచి గాలి పీల్చుకోవాలన్నా,
సువాసనల పరిమళాలు కావాలన్నా, 
కమ్మని, తీయని మధుర ఫలాలతో 
కడుపు నింపుకోవాలన్న, 
అన్నీ తిని దాహం తీర్చుకోవాలన్నా,
అతి నీల లోహిత కిరణాలకు  
మల మల మాడకుండా, 
మలయ మారుతాల అలలతో 
చల్లని నీడల గొడుగులై నిలవడానికి,
అతివృష్టికి సారవంతం కొట్టుక పోకుండా, 
అనావృష్టికి భూమి పొరల్లో నీరు అడగంటి పోకుండా, 
పరి పుష్టమైన పాడి పంటలకు చెట్లే సర్వస్సం. 
చెట్లతోనే  పుట్టలు, కొండా, కోనా, వాగు వంక 
వనరులన్నీ వెల్లువెత్తితే విశ్వ మానవ కళ్యాణమే. 
అన్నీ మరిచి హాయిగా చేయి చేయి కలుపుదాం 
సతత హరితం కొరకు హరితహారం నిలుపుదాం . 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment