అంశం : ఆదివారం
సంఖ్య : 46
శీర్షిక : న్యాయ దేవత
పేరు లోనే ' ఆది ' నిలుపుకున్న వారమా!
పెన్నిధి వయ్యావు ప్రతి వారికి
అలుపు తీర్చుకున్న వారంతా
అష్టకష్టాలు పడి అరిచి గీ పెట్టి
ఆ వారమంతా ఒళ్ళు వంచి
ఆనందాలను పంచుకోడానికి
ఎదురు చూస్తారు మళ్ళీ నీ రాకకై.
నీ రాక ఏరువాకే
బడి పిల్లలకు ...
నీ రాక హరివిల్లే
యువకులకు...
నీ రాక ఆనందాలే
ఉద్యోగులకు...
కానీ
నీ రాక ప్రతిబంధకమే
రెక్కాడితే కానీ డొక్క నిండని శ్రామికునికి
నీ రాక నిష్ప్రయోజనమే
అన్నపూర్ణను అందించే రైతన్నకు
నీ రాక
ధర్మచక్రములో కాంతి రేఖవలె
ఎన్ని సార్లు వచ్చినా .....
అందరిలా సెలవు పొంది
ఆనందించుటకై
అమ్మలకు మాత్రం ఆనతీయవు అదేల?
అందుకే నీ రాక
కళ్ళకు గంతలు కట్టుకున్న
న్యాయ దేవత చేతిలో త్రాసు.
నగునూరి రాజన్న
కరీంనగర్
ప్రస్తుతం USA
No comments:
Post a Comment