Wednesday, September 5, 2018

స్పర్శ

అంశం : స్పర్శ 
04-09-2018
సంఖ్య : 48
శీర్షిక :  స్పర్శకై 

కానుపంటేనే మరో జన్మ 
అయినా వెరవదు అమ్మ 
పసిడి నవ్వుల పాపాయి స్పర్శకై  !

పోలికేకల బాల శిశు 
పొలమారి రోదించు 
అమృతమయమైన అమ్మ స్పర్శకై !

తప్పటడుగుల బాల్యము 
తపించి తమాయించుకునేది  
తనువు పంచి పెంచే  తండ్రి స్పర్శకై !

విజయ కాంక్షపు విద్యార్ధి  
విల విల లాడేది 
గురి కలిగిన ఆత్మీయ గురువు స్పర్శకై !

అలనాటి వైద్య సేవలు 
ఆనవాళ్ల ప్రతీకలు 
అమృతమయమైన వైద్య సపర్యల స్పర్శకై !

చరమాంకాపు జీవితాన తల్లి తండ్రులు 
చకోర పక్షుల్లా ఎదురు చూసేది 
తమ పిల్లల ప్రేమాన్విత పలకరింపు సేవల స్పర్శకై !

పంచ భూతములన్నీ 
సదా  పరితపించేది 
ప్రతి క్షణం జీవరాశిని మురిపించే స్పర్శకై !.  

No comments:

Post a Comment