05-09-2018--- సంఖ్య:49
గణపతి ఘంటం సిరా సంబంధం !
చదివినవారంతా సంతృప్తి చెందాలి!
సరస్వతీ వీణా తంత్రీల స్వరాల బంధం!
కన్న వారంతా తన్మయత్వం చెందాలి!
అమ్మ లాంటి ఆదరింపులు నాన్న లాంటి గద్దింపులతో
ఋజు మార్గములో నడిపించే బంధం!
అనుభవించే వారంతా ఆనంద పడాలి !
రామకృష్ణుని ఆధ్యాత్మికానికి
నరేంద్రుడు శంఖమైనట్టు!
పూరింపును విన్న విశ్వం పులకించాలి!
శిల్పి ఉలికి చెక్కిన శిల్పానికి ఉన్న బంధం!
చూచిన వారంతా చక్కదనానికి చిత్తై పోవాలి!
చాణుక్యుడి ప్రణాళికలకు
చంద్రగుప్తుడు అమలు!
అవని అంత అచ్చెరువొందాలి!
జిజియా భాయి బోధనలు
శివాజీ రణతంత్రం.
విన్న వారంతా వీరత్వం పొందాలి!
గీత బోధించిన కృష్ణునికి
గతి నడిచిన అర్జునుని వలె
నరనారాయణుల బంధం!
మనకు కలగాలని కోరుకోవాలి !
గురు శిష్యుల బంధం
రవి కాంతుల సంబంధం.
రష్మించాలి అజరామరం!
నినదించాలి నిరంతరం !
నగునూరి రాజన్న
కరీంనగర్.
No comments:
Post a Comment