21-09-2018
సంఖ్య : 62
శీర్షిక : నైతికత నాణ్యత
మందు మాకుల కాలుష్యాలతో .....
అమృత సమానమైన
అమ్మ ప్రేమలో సైతం
ఆనవాళ్లు తగ్గుతున్నవేమో నైతికతలో!
తినుబండారాల కల్తీలతో .........
మానవతలు వెల్లి విరియాల్సిన
మానవ సంబంధ బాంధవ్యాల మధ్య
మాయమౌతున్నదేమో నైతికత నాణ్యత !
అశ్వత్థ వృక్షమోలే పాతుకుపోయిన
అవినీతి వల్లనేమో .......
పిల్లల మర్రి మానులా విస్తరించిన
లంచగొండి తనం వల్లనేమో.......
చీడపురుగులా వ్యాపించిన
బంధుప్రీతి వల్లనేమో .......
యథా రాజా! తథా ప్రజా! అన్నట్టు
అమాత్యాలనుండి అధికారులవరకు
వారంటే వీరిని.... వీరంటే వారని ..........
కొందరు తప్ప అందరు అదే తంతు.........
ఆటంక వాదం కన్నా ప్రమాదకరం........
యుద్ధ పరిణామాలకన్నా పెద్ద ముప్పు .......
ఏదైనా ఎదుటివారి కొరకనుకుంటారు.
తమదాకా వచ్చేసరికి లబోదిబోమంటారు.
అవినీతి, లంచగొండితనాల కనిపెట్టి
అడుగడుగున ప్రశ్నిచడం మొదలెట్టు.
ఓటుకు నోటు ఇవ్వజూపినప్ప్పుడే ఛీ కొట్టి
నీతి నిజాయితీలు నీనుండే మొదలెట్టు.
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment