10-09-18
పతనమౌతున్న పంచభూతములు
నిరక్షరాస్యత కొంత....
సోమరితనం ఇంకొంత......
అపరిశుభ్రత ఆవరిస్తే
అనారోగ్యాలు అందలమెక్కుతాయి కదా ..... .
మన ఆచారాల పాటింపు
మంచి సాంప్రదాయాలకు నెలవు.
పరిసరాలు పదిలమౌతేనే
ఆరోగ్యాల ఆనందాలు కదా ....
పంచ భూతములన్న పవిత్రంగ భావించి
ప్రజలంత పూజించె ఆనతో ఆనాడు....
నేల పట్టినా, నీరు వాడినా, అగ్ని ముట్టినా,
వాయువు తాకినా, ఆకసం చూసినా...... .
ఈనాడు :
ఈనాడు :
జాలారి నీళ్ళన్నీ నాలాలుగా పారించి
జల కాలుష్యమంటు జల్లు మంటున్నారు.....
వాహనాలు, వనరులు వాటంగా వాడేసి
వాతావరణం కాలుష్యమంటు వాపోవుచున్నారు.....
పాలిథీన్లు, పంట రసాయనాల చెత్తంత నింపేసి
నేల,నీరు కాలుష్యమంటు
నెత్తి నోరు మొత్తుకుంటున్నారు....
నెత్తి నోరు మొత్తుకుంటున్నారు....
స్వార్థ చింతన కలిగిన సరంగు దళారులతో
సాపాటులన్నీ సర్వ కాలుశ్యాలకు చిక్కుచుండె ....... .
సాపాటులన్నీ సర్వ కాలుశ్యాలకు చిక్కుచుండె ....... .
పాప చింతన లేని కొంత అధికార్లు, పాలకులు
ప్రతీ పనిలో కాలుష్యము జొప్పించి
ప్రజా జీవితాలను ఫణముగా పెట్టి
పరిహాసాల పాలు చేయుచుండె........
కాలుష్యం ఏకరువును కాకి గోలనుకోకు.....
మంచి చెప్పే వారిని వంచించి మాటనకు..... .
పాటు పడే వారికి చేయూతనివ్వండి.
పాటించి చూపువారిని ప్రశంసించండి.
పాటించి చూపువారిని ప్రశంసించండి.
మాటలు మాత్రమే చాలదు నాయకులకు ........
మూటలు విప్పితె చాలదు సర్కారుకు ....
ప్రతి పనిలో దోస్తే చాలదు అధికారులకు ...
అందరూ పవిత్రంగా ఆచరిస్తేనే కదా ......
పతనమౌతున్న పంచ భూతములను
పదిలపరుచుకోవాలి పాప (భవిత) భీతితో.
కాదు కూడదంటే కాగలదు హాని,
కడకు ప్రశార్ధకమౌను మానవాళి.
నగునూరి రాజన్న
కడకు ప్రశార్ధకమౌను మానవాళి.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment