Thursday, September 20, 2018

నవ్వు

15-09-2018
శీర్షిక : నవ్వులు.
సంఖ్య : 57  

అమ్మానాన్నలకు తెలుసు 
ముద్దు ముద్దు మాటల బుజ్జాయిల నవ్వులు. 

చిన్ని చిన్ని పాపలకి తెలుసు 
బోసి నవ్వుల ముచ్చట్లు.  

నవతరం యువుకులకు తెలుసు 
ముసి ముసి నవ్వుల మతలబులు. 

మూడు కాళ్ళ ముదుసలికి  తెలుసు 
అనుభవాల ఆనందపు నవ్వులు.  
 
నిజమైన స్నేహానికి తెలుసు 
సౌహార్ద్రమైన నవ్వు సుగంధం. 

కపటబాజి రాజకీయులకి తెలుసు 
వికటపు నవ్వుల వింతలు. 

అభినయించే నటులకు తెలుసు 
అలవోకగా నవ్వు ఎలా పండించాలో .  

స్వార్థపరులకు  తెలుసు 
ప్లాస్టిక్ నవ్వుల పథకాలు.  

ఆరోగ్య వాంచితులకు తెలుసు 
నవరత్నపు నవ్వు విలువ.  

నూతన పరిచయాన నిలుచు   
చిరు నవ్వు దరహాసాన. 

నవరసాలలో మేటయిన 
నవ్వు నరునికి మాత్రమే తెలుసు. 

నవ్వు, నవ్వించు పది కాలాలు 
పదిలంగా జీవించు. 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (USA ) 

No comments:

Post a Comment