11-09-2018
శీర్షిక : ప్రకృతి సౌందర్యాలు.
పల్లెలో గాని పట్నంలో గాని
మమ్మల్ని చూసి మనసు
పారేసుకోని ఆనందాలలో
ఓలలాడనిదెవరు ?
ఒకప్పుడంటే కాలానుగుణంగా
ప్రాంతాలవారీగా దర్శనమిచ్చే
వారిమి.
వాణిజ్యంగా ఎదిగిన మా
పంటలతో సర్వకాల
సర్వావస్థలలో అన్ని చోట్ల
అందుబాటైయ్యాము.
నిత్యం భక్తితో దేవునికి నివేదించుకునే
సమయాన బంతులు, చామంతులు,
మందారాలుగా మేముంటే సంతృప్తి కదా ...
పెళ్లిల్లలో , పేరంటాలలో
కనులకింపైన అలంకారాలకు
ఆహుతులను ఆహ్లాదపరచడానికి
గులాబీలు,లిల్లీలు,డైసీలు, మల్లెలుగా
నిండు శోభను తెచ్చేది మేమె కదా.
ఆడవారి మనసు దోచుకుని
అతివల కేశాలంకారాలకు మరింత
అందాలను సంతరించే గులాబీలు,
మల్లెలు,చామంతులు,కనకాంబరాలుగా
మేము తోడైతేనే ఇనుమడిస్తాయి కదా ..
రకరకాల రంగురంగుల పూలతో
అచ్చంగా పూజించే బతుకమ్మ పండగంతా
ప్రకృతి పరంగా దొరికే తంగేడు,
గుణక, గుమ్మడి,కట్ల,రుద్రాక్షలుగా
మేమె కదా పూజలందుకునేది ..... .
ప్రకృతి రమ్యంగా పరవశించేది
పలు రకాల పూల మొక్కలతోనే కదా.....
యాంత్రిక జీవనానికి సేద దీర్చేది
పూల మొక్కలని తెలిసినా,
ఎక్కడా మాకింత సరైన చోటు లేకుండా పోతున్నదే....
No comments:
Post a Comment