Thursday, September 20, 2018

తల్లితండ్రులు

 
తేదీ: 18-09-2018 
శీర్షిక : ఆది దేవతలు 
సంఖ్య : 59

అవని ఒడిన అంకురమోలె 
మొక్కకు సూర్య రష్మి తోడైనట్టు  
అమృతబిందువై అమ్మ జన్మనిస్తే 
అప్యాయతలతో  నాన్న పోషిస్తాడు.  
 
అమ్మ కమ్మని అమృతమైతే
నాన్న అది అందించే పాత్ర
అమ్మ ఆది గురువైతే
నాన్న భావి మార్గదర్శి

అమ్మ గురి చూసే బాణమైతే
నాన్న అది విడిచే విల్లవుతాడు
అమ్మ కడుపులో పెట్టుకుంటే
నాన్న గుండెలపై పెంచుతాడు

అమ్మ ప్రత్యక్షమైతే
నాన్న పరోక్షమౌతాడు
అమ్మ ఆప్యాయతలనందిస్తే
నాన్న ఆర్ధిక శక్తినందిస్తాడు

అమ్మ ఆలనతో లాలిస్తే
నాన్న శిక్షణలతో మందలిస్తాడు
అమ్మ ప్రేమను అందిస్తే
నాన్న పట్టుదల నేర్పిస్తాడు

అమ్మ జన్మ ప్రసాదిస్తే
నాన్న ఎదుగుదల అందిస్తాడు
అమ్మ పాలు అందిస్తే
నాన్న పోషణాలిస్తాడు

అంకురానికిరువైపులా
బీజ దళాలున్నట్టు
అమ్మా నాన్నలు ఎప్పుడు
ఆదరువే  పిల్లలకు

అమ్మా నాన్నలు అపురూపమైన 
ఆది దేవతల సమానులు 
అది గ్రహిస్తే జన్మ సార్ధకం 
అది ఆచరిస్తే జన్మ సాఫల్యం.  

No comments:

Post a Comment