నగునూరి రాజన్న
అంశం : పుస్తకం
29-08-2018
కవిత సంఖ్య : 43
శీర్షిక : బాటసారి
అక్షర కుసుమాలను అర్థవంత పదసంపదతో
ఆరబోసిన భావ మార్పిడి భండాగారం.
భాష భావాలను భావి తరాలకు భాద్యతగా
మోసుకెళ్లిన బహుదూరపు బాటసారి .
ఇసుక మీద మొదలైన విద్యకు
ఇరుసువలె నిలిచింది గుప్తంగా
విద్యా సుమ గంధాలను వెదజల్ల
విద్యార్థుల మేధస్సు ఇనుమడించ.
తాళపత్రాలను తావుగా చేసుకున్నా
పలు లోహపు పలకలపై జిలుకరించి పలుకరించినా
తమాయించుక సేద దీరింది మాత్రం
తాను కాగితాల పుస్తక రూపం దాల్చాకే.
ఏ కావ్యమైనా
ఏ ప్రభంధమైనా
ఏ గ్రంధమైనా
ఏ పురాణమైన
ఏ ఉపనిషత్తయినా
ఏ శాస్త్రమైనా
ఏ పద్యమైనా
ఏ గద్యమైనా
ఏ కవితయైనా
ఏ భాషలో ఉన్నా
భావమేదైనా భాష మాత్రమే చాలని
బహుళ ప్రచారం పొందింది మాత్రం
బహు చక్కని పుస్తకరూపం దాల్చాకే....
తరం నుండి తరానికి భావ మార్పిడి బాటసారిగా ...
పయనిస్తూ .....
No comments:
Post a Comment