Thursday, September 20, 2018

కవి సమ్మేళనాలు



మనిషి మనిషిగా ఎదిగి
సంఘమై జీవిస్తున్నాము.
మంచి చెడులను కలబోసి
పంచుకొంటూ!

లక్షల ఏండ్ల  తపస్సులు
భావ పరంపరల బారసాలలకు
భాషా ప్రసవాల ఆవిష్కారాలు.
దిన దిన ప్రవృద్ది నియమాలు పెంచి
రంగులద్ది, హంగులు దిద్ది, సొబగులు నింపి,
నిండు శోభను కూర్చాము.

సంక్షిప్తతతో, సూటిగా, సుందరంగా,
వాడిగా, వేడిగా, హృద్యంగా,
ఊరికన్నా ముందర ఊదర గొట్టేటివి .

ప్రపంచానికి సంబంధించి
పది కాలాలకు పదిలంగా,
పదుల మంది ఒక దగ్గర,
పంచుకునే కష్ట నష్టాల
కావడి కుండలు కవి సమ్మేళనాలు.

జరిగినవి, జరగబోయేవి,
క ష్టం  సుఖం  స్పృశించి ,
లాభం నష్టం  బేరీజు వేసి,
విన సొంపుగా వివరించగలిగేది.

అక్కడక్కడా  అప్పు తచ్చుల్లా 
స్వార్థ సంకుచితత్వాలను 
చంకనేసుకుని ... అధికార 
బలగాలను వెంటేసుకుని ... 
అనారోగ్యమైన అభినందనలు
అనుచితమైన సన్మానాలు  
అక్కరకు రాని పూలమాలలు
తప్పెట తాళాలు వినపడుతూనే 
ఉంటాయి ....  

ఆరోగ్యకరమైన సమ్మేళనాలు
ఆనందాలను పంచుతుంది
జీవితాలను మెరుగు పరుచుతుంది
ఆహ్లాదాలను పెంచుతూ 
అజరామరమై నిలుస్తాయి .

No comments:

Post a Comment