Monday, September 3, 2018

ఏకాంతం

అంశం : ఏకాంతం
30-08-2018
శీర్షిక  : ఏకాంతం
కవిత సంఖ్య -44

మనిషి ఒంటరైతే ఆకాశపుటంచుల్లో
ఏకాంతం దొరుకుతుంది. 
శుక్లమందు శశి కాంతులవలె ఏకాగ్రత పెరుగుతుంది. 
నవనీతం లాంటి మంచి పరిష్కారం దొరుకుతుంది
మనసు ఒంటరైతే అంతర్ముఖమై
పరిణతి చెంది సుందరమౌతుంది. 
మానసిక ధ్యానానికి మార్గం సుగమమౌతుంది.
మనిషి ఆరోగ్యానికి క్షేమమౌతుంది .
పురి విప్పిన ఆలోచనా  సవ్వడులను 
పుటమేసిన స్వర్ణకాంతులవలె
తళుకుళీని మెరిపించవచ్చు.
మంచి సలహాలకు, కవనాలకు,
శాస్త్ర సాంకేతికతలకు ఆలవాలమౌతుంది.
మానవ కల్యాణానికి ఊపిరిలూదవచ్చు.

నిశి రాతిరి ఒంటరి చందమామలా
'నేటి కవితా' సమూహపు కవులంతా
ప్రతి రోజు ఎంతో కొంత ప్రకృతి తో
పరిసరాలతో  ఏకాంతం అనుభవిస్తూ
ఒంటరి పోరాటం చేస్తూ తుంటరిగా
తమ తమ కవితా  ఆ (వ) కాశాలలో
పండు వెన్నెలలు  పండిస్తూ 
సందడి చేస్తూ నిండు పున్నమిని
తలపిస్తున్నారు.

ఆనందాలు నలుగురితో పంచితే
ద్విగుణీకృతమై అవధి పెంచుకోవచ్చు .
బాధలను ఏకాంతంలో అవలోకిస్తే
మూలలను ఛేదించి అధిగమించవచ్చు.

No comments:

Post a Comment