టి వి సీరియల్స్
రంగు రంగుల శబ్ద చిత్ర తరంగిణి
రమ్యమైన ధారావాహికల సూచిని
కానీ
కాలం చెల్లిన కథల గమన పయనం
కకావికలమయ్యే కథనం
కుసంస్కారాల ప్రదర్శితం
కుళ్ళు సంప్రదాయాల సమాహారం
శీర్షిక గానంతో చిందులాట
వాణిజ్య ప్రకటనలకే పెద్దపీట
కథ కదలదు ఏపూట
కానరాదు మంచి మాట
పాత్రలతో పరాచికాలు
పచ్చని కుటుంబాల్లో చిచ్చులు
అంతులేని కపట బాటలు
అనారోగ్యపు నీతి నియమాలు
ఆనందాల శూన్యాలు
సంఘ హితం మరచిన ధారావాహికలు
సరదాలు తీర్చని సమాహారాలు
సాంతంగా అభిరుచి మార్చాలి ప్రేక్షకులు
సమస్య మార్చుతుంది మూలాలు .
No comments:
Post a Comment