Monday, September 3, 2018

ఆలి అద్దెకా ?

03-09-2018
అంశం :  ఆడవాళ్లు 
శీర్షిక :   ఆలి అద్దెకా ? 


విశ్వం చక్షువు తెరువక ముందే 
విశిష్ట సదాచారాలకు, సత్ సంప్రదాయాలకు 
విరి నెలవు మన జాతి యని, దేశమని.....  
సమున్నత సద్భావనలతో 
సంబరపడే  మనందరికీ ........ ........ 

కుసంస్కారాలు నింపుకుని 
పక్క దార్లు వెతుక్కునే 
నక్క జాతి లక్షణాలతో 
కుక్కమూతి  పిందెల్లాంటి 
కొంతమంది వలన  .... ....... ....... 
కుదేలయిపోతున్నరు జనమంతా.  

యుగ యుగాలకన్నా ముందే 
ప్రజలంతా సుఖశాంతుల, సుభిక్షాల వర్ధిల్ల 
అగ్రపూజలందుకునె  రామ రాజ్య పాలన. 

కానీ ప్రజా పాలనంటూనే ..... 
స్వార్థాలకు పెద్ద పీట వేస్తూ.....  
పగ లేని పడగలు విప్పి కాటేస్తూ....  
అడుగడుగునా పరిహాసిస్తూ ...... 
నియమాలను నిలువు పాతరేసి, 
నిబంధనలకు శ్రాద్ధ కర్మలు చేసి 
పతన దిశా పాలనలతో 
ప్రజా పీడనల పరాకాష్టలకు 
పరుగులు పెడుతున్నరు కొంతమంది మన నాయకులు.... 
సకల ప్రజల ధన,మాన, ప్రాణాలకు 
సమాధులు కట్టే ప్రయత్నంతో..... 

మహిళలంటేనే మహిమాన్వితలని 
ఆడపడుచులంటే ఆదిశక్తులని 
అగ్రపూజలన్నీ ఆడవారికేనని 
ఆనవాయితే ..... కానీ ....... 

అడుగడుగున అఘాయిత్యాలతో 
అంటువ్యాధిలా విస్తరించ........  
అశనిపాతమై ప్రజ్వరిల్ల ......  
ఆసేతు హిమాచలం అతలాకుతలం.  
అల్లాడే  ఆడపడుచులకు  
అది ఇది చాలదన్నట్లు.... 

అద్దె భార్యల ఆచారమంటూ..... 
మధ్య ప్రదేశ్, గుజరాత్ న 
దద్దరిల్లే వార్తా కథనాలతో ...... 
కని విని ఎరుగని కనికరం లేని 
అనాగరీకపు ఆనవాళ్లతో ....... 
అపఖ్యాతికి కేంద్రబిందువాయె ......... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

No comments:

Post a Comment