Thursday, September 20, 2018

ముగ్గు

14-09-2018
సంఖ్య : 56                    
శీర్షిక : తెలుగింటి ఆడపడుచు 

యుగయుగాల సత్సాంప్రదాయం... 
తరతరాల సదాచారం....  
తరగని నెలవులు మన దేశాన 
తనివి తీరని సతత సంబరాలే కదా!  

మట్టి గోడలైనా సుష్టుగా నిలుపు 
శత వత్సరములైనా ఇంటిని ............ 
వర్షఋతువు దాటి వానల్లు తగ్గ 
కాలాని  కనుగుణంగా కడు రమణీయంగా    
చుట్టు గోడలు అలికి  చిత్రించె ముగ్గులతో 
సవత్సరమంతా సంరక్షణలనిచ్చు...   
పండగల సందళ్ళకు ప్రకృతి శోభలనిచ్చు 
పావనంగా చవితి దసరా దీపావళులకు.... 

ప్రతి ఇంటి వాకిళ్ళ లోగిళ్ళు 
పేడ నీళ్ళ కళ్ళాపే కానీ... పేదింటి ఆరోగ్యాలయాలు.    
అలికి  ముగ్గు పెట్టడం....ఆడపడుచుల కనికట్టు...  
తీరొక్క ముగ్గులతో చూపరులనాకట్టు .... 
శుచి శుభ్రతలకు ప్రతిబింబం...  
సుందరమైన అందం సుమనోహరమైన ఆరోగ్యం.... 

సంక్రాంతి ముగ్గులు సందళ్లు పెంచు
రంగు రంగుల ముగ్గులు రమణీయతలకు కొలువు
వాకిళ్ల పరుచు వైవిద్యమైన ముగ్గులు 
గొబ్బెమ్మల నిలిపి గోవుల పూజించ. 
 
ముద్దబంతుల మాలలు మురిపాలు పెంచు 
పలు రంగుల పూలు పసిమి సువాసనల కొలను.  
పచ్చని ఆకులు ప్రాణవాయులకు నెలవు 
మామిడాకుల తోరణాలు మంగళకరం.  
 
పసుపు కుంకుమల ముగ్గులు గడపన 
పలురకాల క్రిమి కీటకాదుల నిలుపు
ఇంటిల్లిపాదికి ఆరోగ్యాలు నింపు .  
గురువు  నేర్పని విద్య గురుతరముగా భావించె
తెలుగింటి ఆడపడుచు తెల్లవారగనే.  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (USA )

No comments:

Post a Comment