అంశం : గోకులాష్టమి
శీర్షిక : బృందా విహారి
03-09-2018
సంఖ్య : 47
దేవకీ సుతుండు దైవాంశ సంభూతుడు
అష్టమ గర్బంగా అవతరించాడు.
అష్టమీ తిథియందు కష్టములు బాప
అష్ట సఖులకు తాను ఇష్టపతి యైనాడు .
వసుదేవ తనయుండు వామనావతారుండు
ఆదిశేష శయనుండు ఆపద్బాంధవుడయ్యె.
యదుకుల భూషణుండు యశోద నందనుడు
మన్ను తిన్నా మిన్ను చూపి, గోవర్ధమెత్తి రేపల్లె కాపాడె .
పాలు మీగడల వెన్న దొంగ, పాలపుంతల కలయిక
పడతుల వస్త్రములు దాచి శరణు వేడించే.
కంసున్ని మర్దించి, కాళీయునిపై నర్తించి
కమల లోచనుండు కరుణించె దీనుల.
అఖిలాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుడు
జగన్నాటక సూత్రుడు భారతాన్ని బాధ్యతగా నడిపాడు .
మానవుడే మాధవుడై గీత బోధించి ధర్మ రక్షణకు నిలిచి
శిష్ట రక్షణకై పాండవపక్ష పాతియైనాడు.
చిన్ని చిన్ని పాదాల శ్రీ కృష్ణమూర్తి
వేగమే రావయ్యా బృందా విహారి మా ఇంటికి
వేవేల జపియింతు వేద పురుషా నీ రాకకై
వేణు మాధవా ! దీన బాంధవా ! మమ్ము బ్రోవరా !
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment