Monday, September 3, 2018

బాల కార్మికులు

అంశం : బాల కార్మికులు 
శీర్షిక : భావి భారత పౌరులు 

నేటి బాలలే రేపటి పౌరులని 
నగారా బాకాలు బాగానే .......  

చెంగు చెంగున గంతేసే 
లేగ దూడల బాల్యాన్ని.....  
దిక్కు మొక్కు లేని కుక్కపిల్లల్లా
రాబందుల కబంధ హస్తాల్లో ..... 
రాక్షస కలుషిత వాతావరణాల్లో 
కొలిమి మంటల కాసారాల్లో 
రెల్లు పొదల సావిల్లలో 
కునారిల్లి పోతున్నాయి. 

చట్టాలనేకం కాగితాలపై ... 
చుట్టాలనేకం నాయకులకు ... 
గుండాలనేకం గుత్తేదార్ల గుప్పిట్లలో....... 
అధికారులనేకం కొంత అమ్యామ్యాల యావల్లో ..... 
నాయకులనేకం కొంత స్వార్ధ రాజకీయ కోరల్లో ........ 
స్వచ్చంద సంస్థలనేకం........... 
కొన్ని స్వార్థ పరుల కనుసన్నల్లో ..... 

సమస్య కొండంత 
పరిష్కారాలు చిన్న బండంత.  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment