12-09-2018
కవిత సంఖ్య : 54
ప్రభాత వేళoటే ......
వెండికొండల్లాంటి మబ్బులపైకి
లేత నారింజ రంగు కిరణాలనంపి.....
చిత్రకారుని కుంచెలోంచి జాలువారిన
అరవిరిసిన అందాలను ఆరబోసి .....
కారు చీకట్లను కదిలించి పంపించ
కాచుకున్న దినకరుడు.....
మంచు ముత్యములారబోసిన
పచ్చిక బయళ్లు.......
పక్షుల కిలకిలా రవములు......
కోడి పుంజుల కొక్కరక్కోలు.....
లేగదూడల అంబాలు.........
జంగం దేవరల శంఖారావాలు .....
అమ్మ నాన్నల మేలుకొలుపులు......
చిట్టి చెల్లెళ్ళ కూని రాగాలు ...........
కౌసల్య సుప్రజా కీర్తనల........ తో
పలకరించేది ప్రభాత సమయం.
కానీ ఇప్పుడంతా .....
న్యూస్ పేపర్ల నడకలతో ......
పాల ప్యాకెట్ల పరుగులతో .......
మూడువందల అరవై డిగ్రీలు ....
పని రాక్షసులతో పోరాడి అలిసిన
దేహాలతో .........
ఒళ్ళు విరుచుకుని......
నిద్రమత్తు వదిలి వదలక......
ఇష్టమై కాకుండా బద్దకంగా.......
నడకలు సాగించే పిల్లా పాపలు.....
సెల్లు మోతలతో ........
ఆకాశ హర్మ్యాలతో అడ్డుపడుతున్న
సూర్య రష్మిని వెతుక్కుంటూ ....
విటమిన్ డి కై వెంపర్లాడుతున్నది జనాగారం.
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA )
No comments:
Post a Comment