24-09-2018
సంఖ్య : 64
శీర్షిక : పవిత్ర బంధం
మను సిద్ధాంతమో మనం నమ్మినదో....
విశ్వం కన్ను తెరవకముందే
ప్రతి పనిలో ప్రశస్తమైన శాస్త్రీయత
సదాచారం, సత్సాంప్రదాయాల కలబోత...
పూర్వ బంధం ఉన్నా లేకున్నా .....
వేద మంత్రాల పంచ భూతాల సాక్షిగా
మూడు ముళ్ళతో జత కట్టే అనుబంధం.
ఏడడుగులతో మొదలయ్యే పవిత్ర బంధం .
బాసల ఊసుల ప్రతినిధులై
బంధువుల ఆశీర్వచనాలతో
బరువు బాధ్యతలను పంచుకుంటూ
భరోసాలు నింపుకుంటూ బతుకు బాటలో పయనించేది.
ఆపద సంపదలందు అతలాకుతలం కాకుండా....
అన్యోన్యతలో ఆణిముత్యాలై
త్యాగాల తలపుల్లో పునీతులై
సంయమనంతో సమయస్ఫూర్తితో.... సాగిపొయ్యేది.
ప్రకృతి పరమైన వాంఛలకు
పెడదారుల పాలు కాకుండా
ప్రేమామృతాలు పంచుతూ
సృష్టి తరాలకు మూలమయ్యే
సుందర పరమ పవిత్ర బంధం.
No comments:
Post a Comment