అంశం : అక్షరాస్యత
08-09-2018
శీర్షిక : వారధి
అక్షరాస్యత అంటే
అమృత సమానమైన అమ్మ తత్వం !
అక్షరాస్యత అంటే
గుంభనంగా ప్రేమ చూపగలిగే నాన్న తత్వం !
అక్షరాస్యత అంటే
అభివృద్ధిని ఆకాంక్షించే గురువు తత్వం !
అక్షరాస్యత అంటే
అనుబంధాలను అల్లుకునే ప్రేమ తత్వం !
అక్షరాస్యత అంటే
ఆత్మీయతలను పంచుకునే అనురాగ తత్వం !
అక్షరాస్యత అంటే
పొరుగు క్షేమం కోరే ఓర్పు తత్వం !
అక్షరాస్యత అంటే
సాటి మనిషిని చల్లగా చూసే వెన్నెల తత్వం !
అక్షరాస్యత అంటే
స్వార్థాలను త్యజించే త్యాగ తత్వం !
అక్షరాస్యత అంటే
ప్రకృతిని ప్రేమించ గలిగే సమ తత్వం !
అక్షరాస్యత అంటే
నాశము లేని మంచి శాశ్వ తత్వం!
అక్షరాస్యత అంటే
నిరక్షరాస్యుల్లో ఉండే ప్రాకృతికమైన
మంచిని మరింత ఇనుమడింప చేసుకుని
ఆచరించి ముందు తరాలకు ముగ్ధంగా
అందించే వారధి.
No comments:
Post a Comment